శ్రీమతి లకిరెడ్డి పాపులమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1987-1992 బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో వెల్వడం మెయిన్ సెంటర్ కచేరి చావిడి వద్ద నిర్వహిస్తున్న మంచి నీటి చలివేంద్రం వద్ద ఈ రోజు అనగా 14-04-2023 ఉదయం 10.00 నుండి మజ్జిగ పంపిణీ జరిగింది. శ్రీ గురాల వెంకట కోటేశ్వర రెడ్డి (పెద్ద బాబు) గారి వితరణ తో నిర్వహించడం జరిగింది. సుమారు 400మందికి పైగా ఉచితంగా మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ముఖ్య అతిధిలుగా కుడుముల పద్మజ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కుడుముల వెంకట నారాయణ రెడ్డి (NRI-USA) మరియు యరమల రాఘవ రెడ్డి (NRI-USA) లు హాజరయ్యారు. వేసవి లో ప్రయాణికుల దాహార్తి ని తీర్చడానికి చలివేంద్రం నిర్వహిస్తున్న గూడూరు నాగిరెడ్డి వారి మిత్ర బృందం సేవలను కొనియాడారు. చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీకి సహకరించిన గురాల కోటేశ్వర రెడ్డి గారిని పూర్వ విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమము లో అంబటి ఉదయ భాస్కర్ రెడ్డి, తలపరెడ్డి భాస్కర్ రెడ్డి, పల్లబోతుల గోపాలం, ఆనం వెంకటేశ్వర రావు, బజారు కిషోర్, ఎల్ ఐ సి శ్రీను మరియు పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.