Date:21-02-2023 యల్.బి.ఆర్.సి.ఈ మెకానికల్ విద్యార్థుల ప్రతిభ స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు ఇష్రె, విజయవాడ చాప్టర్ వారు నిర్వహించిన "ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వేస్ట్ తో బెస్ట్ " అనే అంశంపై నిర్వహించిన పోటీలలో ఇష్రె స్టూడెంట్ చాప్టర్ ఆప్ యల్.బి.ఆర్.సి.ఈ మెకానికల్ విద్యార్థులు పి .వెంకట వంశీ , ధీరజ్ కార్తీక్ లు ద్వితీయ స్థానంలో Rs:5000/-నగదు బహుమతి మరియు తేజ, హారిక మరియు తేజస్వి లు కన్సోలేషన్ ప్రైజ్ Rs:2500/- నగదు బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు, మెకానికల్ విభాగాధిపతి డా.ఎస్.పిచ్చిరెడ్డి మరియు ఇష్రె కో ఆర్డినేటర్ డా.పి.విజయ్ కుమార్ గార్లు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు గారు మాట్లాడుతూ ఇలాంటి పోటీలలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభకు సాన పెట్టాలని హితవు పలికారు. (డా.కె .అప్పారావు) ప్రిన్సిపాల్