Homehttps://youtu.be/d6FCt8vHA9g https://youtu.be/d6FCt8vHA9g RJ7 MEDIA February 23, 2022 Newer Older
ప,గో, జిల్లా :- పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం, సత్యనారాయణపురం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి అటుగా వస్తున్న ఏలూరు డిఎస్పి దిలీప్ కిరణ్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. January 18, 2022
*విజయవాడ* _*ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొండపాటి విజయ్ కుమార్ మీడియా సమావేశం వివరాలు..*_ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులకు సెలవులు పొడిగించాలి అని కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు* ★ విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆలోచించలేని పరిస్థితిలో విద్యాశాఖమంత్రి ఉండటం దురదృష్టకరమన్నారు. ★ పాఠశాలలో ముందస్తు ఏర్పాట్లు లేకుండా యధావిధిగా కొనసాగించటం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమే అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ★ విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా సెలవులు పొడిగించాలి అని డిమాండ్ చేశారు. ★ 15 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకుండా విద్యార్థులకు పాఠశాలలు నిర్వహించడం దుస్సాహసమే అవుతుందన్నారు. ★ గతంలో కోర్టులతో మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా విద్యార్థుల విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము లేదు. ★ విద్యా వ్యవస్థను ఎలా నడపాలో అవగాహన లేని విద్యాశాఖ మంత్రి ,రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరం. ★ కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిస్థితులు సద్దుమణిగే వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించాలని అన్నారు. ★ కరోనా విషయంలో ప్రభుత్వ గణాంకాలు రోజురోజుకి పెరుగుతున్నప్పటికి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ★ విద్యార్థులకు మూడో వేవ్ వ్యాప్తి దృష్ట్యా పాఠశాలలో తగిన ఏర్పాట్లు లేకపోవడం వలన విద్యార్థులకు వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ అని అన్నారు. ★ విద్యార్థుల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలు ఆడుకోవడం చాలా అన్యాయం. ★ పాఠశాలలు యధావిధిగా ప్రారంభించి విద్యార్థులలో కరోనా వ్యాప్తికి కారణం అయితే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నారు. ★ ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడ్డా దాని బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటాడా అని ప్రశ్నించారు? ★ విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించే ముఖ్యమంత్రి దొరకటం కడు శోచనీయమని అన్నారు. ★ పాఠశాలలు యధావిధిగా కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఏపీ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొండపాటి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. January 17, 2022
ఉంగుటూరు మండలం వెంకటరామాపురం గ్రామానికి చెందిన బొమ్మిడి లక్ష్మయ్య గారు ఇటీవల మరణించగా చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించిన గన్నవరం శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ గారు.... January 20, 2022