ప,గో, జిల్లా :- పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం, సత్యనారాయణపురం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి అటుగా వస్తున్న ఏలూరు డిఎస్పి దిలీప్ కిరణ్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.