*ఈరోజు బంద్ జయప్రదం చేయండి* రాష్ట్రంలో కేజీ నుంచి పిజీ వరకు నెలకొన్న విద్యార్థులకు సమస్యల పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 23 న జరుగుతున్న విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ ఏలూరు నగరంలో బైక్ ర్యాలి నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం అనిల్ కుమార్, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు నాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 117 తీసుకొచ్చి 3,4,5 తరగతుల విద్యార్థులను తరగతుల విలీనం పేరుతో హైస్కూల్లో కలపడం వల్ల రాష్ట్రంలో సుమారు పదివేల పాఠశాలలో మూతపడుతున్నాయని దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయకుండా యన్ఈపి 2020 అమలు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటు కార్పొరేటర్ వ్యక్తులకు తాకట్టుపెట్టే విధంగా జగన్ రెడ్డి చర్యలు చేపడుతున్నాడని పాదయాత్ర సమయంలో హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అందిస్తానని ముఖ్యమంత్రి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇంత వరకు అమలు చేయకపోవడం దుర్మార్గమని డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కన్వీనర్ కోట మేనేజ్మెంట్ కోటని విభజించి 30 శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వం ఏ విధమైన సాయం అందకుండా డిగ్రీ విద్యార్థులను జగన్ సర్కార్ మోసం చేస్తుందని డిగ్రీ పూర్తిచేసుకుని ఉన్నత చదువులు చదువుకోవడానికి వీలు లేకుండా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వారు విమర్శించారు ఈ విధమైన చర్యలు మొత్తాన్ని వ్యతిరేకిస్తూ పీజీ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు దుప్పట్లు అందించాలని స్కూల్ పిల్లలకు పాఠ్యపుస్తకాలు తక్షణమే అందించాలని అర్హులైన ప్రతి ఒక్కరికి విద్య దినం వస్తే దీవెన ఇవ్వాలని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్ కు విద్యార్థి లోకం ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించి జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ ఏలూరు జిల్లా కార్యదర్శి గరికే అఖిల్ పి. డి.యస్.యు నగర కార్యదర్శి క్రాంతి ఏఐఎస్ఏ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు హుసేన్ ఏఐఎస్ఏ నగర అధ్యక్ష కార్యదర్శులు జయకుమార్ నారి శ్రీను ఏఐఎస్ఏ నాయకులు వెంకట్, శ్రీను, రఘు, యశ్వంత్, పిడిఎస్యు నాయకులు జానకిరామ్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు