గన్నవరం నియోజకవర్గం *ఒంగోలు మహానాడు విజయవంతం చేయండి* *ప్రజల్లో మార్పు వచ్చింది.. చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారు* *ప్రజలు బుద్ధి చెబుతారని గన్నవరం లో నిర్వహించిన తెదేపా మినీ మహానాడులో వర్ల రామయ్య అన్నారు.* *- రాష్ట్రంలో మోసపూరిత పథకాలు అమలు చేస్తున్నారని వాపోయారు.* *- ప్రజల్లో మార్పు వచ్చిందని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారని బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు.* ★ కృష్ణాజిల్లా గన్నవరం తెదేపా మహానాడు సన్నాహక సమావేశ కార్యక్రమం గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు శాసనమండలి సభ్యుడు శ్రీ బచ్చుల అర్జునుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలిట్ బ్యూరో సభ్యుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వర్ల రామయ్య గారు, మరొక్క ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గత రెండు సంవత్సరాలలో వివిధ రకాల కారణాలతో మరణించిన టిడిపి నాయకులు మరియు కార్యకర్తలకు నివాళులర్పించడం జరిగింది. ★ జగన్మోహన్, వల్లభనేని వంశీ పెద్ద దొంగలని ఆరోపించారు. ★ ఎన్టీ రామారావు మోచేతి నీళ్లు తాగిన వల్లభనేని వంశీ నేడు చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ★ జగన్, వంశీ లకు ప్రజలు బుద్ధి చెబుతారని బచ్చుల అర్జునుడు అన్నారు. ★ మోసపూరితంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నారని వాపోయారు. ★ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ★ మహానాడు ప్రతి తెదేపా కార్యకర్తకు పెద్ద పండుగలాంటిదని మాజీ పార్లమెంటు సభ్యుడు కొనగళ్ళ నారాయణ స్పష్టం చేశారు. ★ 151మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. ★ గన్నవరం గడ్డని తెదేపా అడ్డాగా మారుస్తామని బచ్చుల అర్జునుడు తెలిపారు. *ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర , జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.*