*స్క్రోలింగ్....స్క్రోలింగ్* తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట శివారు గండేపల్లి మండలం నీలాద్రిరావు పేట జాతీయ రహదారిబ్రిడ్జి శివారు ఆదిత్య హాస్పిటల్ ఎదురుగా జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ పై వెళ్తున్న వారిని ఢీకొన్న టాటా సఫారీ వాహనం. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఆపకుండా పరారీ అవుతున్న తరుణంలో వాహనాన్ని వెంబడించి పట్టుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు మహిళ కాగా, మరొకరు పురుషులు వివరాలు తెలియాల్సివుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.