ముందుకెళ్లాలంటే భారత్ మిగతా జట్లను ఎంత తేడాతో ఓడించాలి


 
టీ-20 ప్రపంచకప్‌ (T-20 World Cup 2021)లో సూపర్ విక్టరీతో భారత్‌ (Team India) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఫ్లాప్‌ అయిన బ్యాటింగ్‌ ఒక్కసారిగా "సూపర్‌ హిట్‌" అయ్యింది. విలన్లుగా మారిన టీమిండియా బౌలర్లు ఒక్కసారిగా హీరోలుగా మారారు. గ్రూప్‌–2లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రతాపంతో 66 పరుగులతో నెగ్గింది.ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలవడంతో టీమిండియా తమ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇక, టీమిండియాకు గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచులు మిగిలాయ్. స్కాట్లాండ్, నమీబియాలతో టీమిండియా నెక్ట్స్ మ్యాచులు ఆడనుంది. అఫ్గానిస్థాన్ తో పోల్చుకుంటే.. ఆ రెండు జట్లతో పోరు కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు. అఫ్గానిస్థాన్ మీద విక్టరీతో టీమిండియా నెట్ రన్ రేట్ కూడా మెరుగైంది.టీమిండియా నెట్ రన్ రేట్ : టీమిండియా రన్ రేట్ ఇప్పుడు ప్లస్ లోకి వచ్చింది. - 1.609 నుంచి +0.073కి టీమిండియా నెట్ రన్ రేట్ పెరిగింది. మరోవైపు అఫ్గానిస్థాన్ నెట్ రన్ రేట్ +3.097 నుంచి +1.481 కి తగ్గింది. మరోవైపు న్యూజిలాండ్ రన్ రేట్ +0.816. ఇక, టీమిండియా, న్యూజిలాండ్ లు గ్రూప్ స్టేజిలో చెరో రెండు మ్యాచులు ఆడనున్నాయ్.