ఆ డ్రింక్స్‌తో బరువు తగ్గడం కష్టమే


 ఈ రోజుల్లో అధిక బరువు (Heavy weight) సమస్య ఎంతోమందిని వేధిస్తోంది. ఎలాగైనా బరువు తగ్గిపోవాలని చాలామంది ఊబకాయులు (obesity) కోరుకుంటుంటారు. ఈ క్రమంలో తక్కువ సమయంలో కిలోల చొప్పున బరువు తగ్గేందుకు ప్రముఖ డ్రింక్స్ పై ఆధారపడుతుంటారు. ఈ డ్రింక్స్ తాగితే చాలు.. వద్దన్నా బరువు తగ్గిపోతామని (weight loss) భ్రమ పడతారు. కానీ ఇలాంటి డ్రింక్స్ నిజంగా బరువు తగ్గించగలవా? ఈ డ్రింక్స్ పుచ్చుకున్నంత మాత్రాన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు (cholesterol) కరుగుతుందా? అని ప్రశ్నిస్తే అది అసాధ్యమని అంటున్నారు వైద్యులు. కేవలం పానీయాలతో బరువు తగ్గడం (weight loss) అంత సులభమేమీ కాదంటున్నారు. హెల్దీగా, స్థిరంగా బరువు తగ్గాలంటే హెల్దీ ఫుడ్ (healthy food) తీసుకుంటూ నిరంతరం వ్యాయామం (exercise) చేయడమే ఉత్తమమైన మార్గమని సూచిస్తున్నారు.