అమ్మాయికి సోషల్ మీడియా వేధింపులు


పెళ్లి సంబంధాలు కుదుర్చోవడం అంటే గతంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తారలు చూసుకుని పెళ్లిలు చేసుకునే వారు.. కాని ఆధునిక కాలంలో ఆ పద్దతికి యువతి యువకులు ఫుల్ స్టాప్ పెట్టారు. తమకు నచ్చిన వారిని సెలక్ట్ చేసుకోవడం ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. ఇది కుదరని వారు మ్యాట్రిమోనియల్ వేదికలపై ఆధారపడుతున్నారు. అయితే అక్కడ కూడా ముందుగానే తమ సమాచారాన్ని ముందుగానే వారికి తెలిపి... నచ్చిన వారింటికి వెళ్లి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.అయితే కొన్ని చోట్ల సంబంధాలు స్పీడ్‌గా కుదరకపోవడంతో అంతే స్పీడుగా తమ రియాక్షన్ చూపిస్తున్నారు కొంతమంది యువకులు.. తమకు నచ్చిన వారిని .. లేదంటే తమను రిజెక్ట్ చేసిన వారిపై రివేంజ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మ్యాట్రిమోనియల్‌ వేదిక ద్వారా పరిచయమై సంబంధానికి వచ్చిన అబ్బాయి అమ్మాయి కుటుంబానికి నచ్చకపోవడంతో అవమానానికి గురయ్యాడు. దీంతో ఆ అమ్మాయిని ఫేస్ బుక్ ద్వారా వేధింపులకు గురి చేసిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బోడుప్పల్‌‌కు చెందిన ఓ యువతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. వివాహం కోసం ఓ మాట్రిమోనియల్ సంస్థలో రిజిస్టర్ అయింది. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే అమ్మాయి కోసం వేచి చూస్తున్న .. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు పట్టణానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు నెల రోజుల క్రితం బోడుప్పల్‌లోని అమ్మాయికి చేరుకున్నారు. అయితే ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్న తర్వాత అమ్మాయి కుటుంబానికి నచ్చలేదు... దీంతో ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేశారు.

అయితే తనకు నచ్చినా అమ్మాయి రిజెక్ట్ చేసిన అమ్మాయిపై సాయికుమార్ కక్షను పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిని దొంగచాటుగా వేధించేందుకు నిర్ణయించాడు. దీంతో ఫేక్ ఫేస్‌బుక్ ఐడి క్రియోట్ చేసి ఆ యువతిని అసభ్య పదజాలంతో తిట్టాడు. పలు మెస్సెజ్‌లు పెడుతూ మనసికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో యువతి కుటుంభం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.